సోమవారం 08 మార్చి 2021
Business - Jan 06, 2021 , 01:31:28

సరికొత్తగా ‘ఎస్‌-క్లాస్‌'

సరికొత్తగా ‘ఎస్‌-క్లాస్‌'

ముంబై, జనవరి 5: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌.. ఫ్లాగ్‌షిప్‌ మోడలైన ఎస్‌-క్లాస్‌ మ్యాస్ట్రో ఎడిషన్‌ను విడుదల చేసింది. భారత్‌లో ఈ కారు ధరను రూ.1.51 కోట్లుగా నిర్ణయించింది. నూతన టెక్నాలజీని కోరుకునేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ వెర్షన్‌లో పలు మార్పులు చేసి కనెక్టెడ్‌ కారు టెక్నాలజీతో అనుసంధానమయ్యేలా తీర్చిదిద్దినట్లు మెర్సిడెజ్‌-బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్‌ స్కేవెంక్‌ తెలిపారు. కేవలం ఆరు సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 210 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. 

VIDEOS

logo