మంగళవారం 02 మార్చి 2021
Business - Jan 01, 2021 , 18:29:22

న్యూ ఇయర్ లో... సెన్సెక్స్, నిఫ్టీ ల సరికొత్త రికార్డు

న్యూ ఇయర్ లో... సెన్సెక్స్, నిఫ్టీ ల సరికొత్త రికార్డు

ముంబై: స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది మొదటి రోజున లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మొదటిసారి 14,000 మార్కు దాటి క్లోజ్ అయింది. ఇక సెన్సెక్స్ 48,000 మార్కుకు 32 పాయింట్ల దూరంలో మాత్రమే నిలిచింది. ఈ వారంతో సెన్సెక్స్ వరుసగా 9వ వారం లాభాల్లో ముగిసింది. 2010 ఏప్రిల్ తర్వాత మళ్లీ ఇలా క్లోజ్ కావడం ఇదే మొదటిసారి. 1998 స్టాక్స్ లాభాల్లో ముగియగా, 940 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.163 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. నిఫ్టీ బ్యాంకు మాత్రం నష్టాల్లో ముగిసింది. ప్రయివేటు రంగ బ్యాంకు అద్భుతంగా రాణించింది. 2021 జనవరి 1.. మొదటి రోజునే మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి.

సెన్సెక్స్ 117.65 పాయింట్లు అంటే 0.25శాతం లాభపడి 47,868.98 పాయింట్ల వద్ద, నిఫ్టీ 36.70 పాయింట్లు అంటే 0.26శాతం ఎగిసి 14,018.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ మరో సరికొత్త శిఖరం 48వేలకు 32 పాయింట్ల దూరంలో ముగిసింది. ఐటీ సూచీ రికార్డ్ స్థాయిని తాకాయి. జీఎస్టీ కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో వసూలైన విషయం తెలిసిందే. జీఎస్టీ అమలైనప్పటి నుంచి ఇదే గరిష్టం. డిసెంబర్ నెలలో వసూళ్లు రూ.1.15 లక్షల కోట్లు దాటాయి.ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను జనవరి 13న ప్రకటించనుంది.


 ఇవి కూడా చదవండి... లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

VIDEOS

logo