బుధవారం 03 మార్చి 2021
Business - Jan 24, 2021 , 02:11:52

సరికొత్త ఆల్ట్రోజ్‌ ప్రారంభ ధర 8.26 లక్షలు

సరికొత్త ఆల్ట్రోజ్‌ ప్రారంభ ధర 8.26 లక్షలు

న్యూఢిల్లీ, జనవరి 23: దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటర్స్‌ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ‘ఆల్ట్రోజ్‌' మోడల్‌లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘ఆల్ట్రోజ్‌ ఐ-టర్బో’ పేరుతో తీసుకొచ్చిన ఈ కారులో శక్తివంతమైన ఇంజిన్‌తోపాటు కనెక్టెడ్‌ టెక్నాలజీ లాంటి అత్యాఆధునిక ఫీచర్లను పొందుపర్చింది. ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్‌, ఎక్స్‌జెడ్‌ ప్లస్‌ అనే మూడు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుందని టాటా మోటర్స్‌ వెల్లడించింది. పెట్రోల్‌ వేరియంట్‌ ప్రారంభ ధరను రూ.8.26 లక్షలుగా, డీజిల్‌ వేరియంట్‌ ప్రారంభ ధరను రూ.9.46 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆల్ట్రోజ్‌ రెవోట్రాన్‌ మోడళ్ల కంటే ఆల్ట్రోజ్‌ ఐ-టర్బో మోడళ్ల ధర రూ.60 వేలు ఎక్కువ. ఇంటెలిజెన్స్‌ రియల్‌-టైమ్‌ అసిస్ట్‌ (ఐఆర్‌ఏ) కనెక్టెడ్‌ సాంకేతికతను కలిగిన ఆల్ట్రోజ్‌ ఐ-టర్బోలో 27 కనెక్టెడ్‌ కార్‌ ఫీచర్లు ఉంటాయని.. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు హింగ్లిష్‌ (హిందీ+ఇంగ్లిష్‌) కమాండ్లను ఈ కారు సులభంగా అర్థం చేసుకోగలుగుతుందని టాటా మోటర్స్‌ వివరించింది. 


VIDEOS

logo