ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఐటీ పరిశ్రమ రెండంకెల వృద్ధిని నమోదు చేయొచ్చునని దేశీయ ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్ జీ వ్యాఖ్యానించారు. కరోనాను నియంత్రించడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ల వల్ల బిజినెస్ నిర్వహణ స్వరూపాలు మారిపోయాయి. దాదాపు అన్ని వ్యాపారాలు సంప్రదాయ మార్గం నుంచి దారి మళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో బిజినెస్ లావాదేవీలు యథాతథంగా కొనసాగేందుకు ఐటీ పరిశ్రమ కీలకంగా వ్యవహరించింది.
ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగ పరిశ్రమ గణనీయ పురోగతి సాధించవచ్చునని అజీం ప్రేమ్ జీ చెప్పారు. మంగళవారం ఆయన బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ 73వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగించారు.
మహమ్మారి వేళ ప్రపంచాన్ని ముందుకు నడిపించడంలో ఐటీ రంగం కీలకంగా వ్యవహరించిందని ప్రేమ్ జీ చెప్పారు. ఈ నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేసినా తాను ఆశ్చర్య పోనని అన్నారు.
ఐదు లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న ఆకాంక్షలను నెరవేర్చడంలో, తదుపరి భారత్ వృద్ధి దశలో ఐటీ రంగ పరిశ్రమ సముచిత స్థానం పొందుతుందన్నారు. హైబ్రీడ్ మోడల్ పని విధానంలో ఐటీ రంగం లబ్ధి పొందిందన్నారు.
సమగ్ర వృద్ధిని సాధించడంలో హైబ్రీడ్ మోడల్ పని విధానంతో భారీ లబ్ధి చేకూరుతుందని ప్రేమ్ జీ వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు మెరుగైన ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు.
భారత్ వంటి అతిపెద్ద జనాబా, భౌగోళిక దేశంలో అతిపెద్ద వ్యాపారాల నిర్వహణ కంటే సామాజిక మార్పులు చాలా సంక్లిష్టం అని అజీం ప్రేమ్ జీ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు పూర్తిగా సంక్లిష్టమైనవని చెప్పారు.
కరోనా మహమ్మారి వల్ల ఏడాదిన్నర కాలంగా విద్యార్థులకు స్కూలింగ్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనుక ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ చేయించి, పాఠశాలలను తెరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
కర్నాటకం : యడియూరప్పపై టూరిజం మంత్రి తిరుగుబాటు
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
ప్రపంచంలోనే ఎత్తయిన గుర్రం బిగ్ జాక్ ఇకలేదు..!
విస్తారా ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్
రెనాల్ట్ కార్లపై అద్భుతమైన ఆఫర్లు… భారీ డిస్కౌంట్స్…
ఇన్ కమ్ టాక్స్ ఫైల్ చేయడానికి సడలింపులు..
ఏడాదిలో మూడోసారి : టాటా కార్ల ధరలకు రెక్కలు!
రూ.15 లక్షల కోట్లు.. ప్రపంచ కుబేరుల్లో ఇంకా టాప్‌లోనే బెజోస్
ఆంక్షలపై తగ్గేందుకు సౌదీ ససేమిరా.. సంక్షోభం ముంగిట ఓపెక్?