గురువారం 28 మే 2020
Business - Mar 30, 2020 , 11:41:43

దిగివ‌స్తున్న బంగారం ధ‌ర‌లు

 దిగివ‌స్తున్న బంగారం ధ‌ర‌లు

కరోనా ఎఫెక్ట్‌తో బంగారం ధరలు సైతం దిగివస్తున్నాయి. మహమ్మారి విజృంభణతో కొనుగోళ్లు పడిపోయిన క్రమంలో పసిడి ధర పతనమైంది. ఇవాళ హైద‌రాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధ‌ర ఏకంగా రూ 1,925 త‌గ్గి 43, 375కు చేరింది. అటు 22 క్యారెట్ల 10గ్రాముల ప‌సిడి ధ‌ర రూ.1,940 రూ. 39,830కి ప‌డిపోయింది. ఇక కేజీ వెండి ధ‌ర రూ.1,910కి త‌గ్గ‌డంతో రూ.39,500కి ప‌డిపోయింది. జువెల‌ర్ల నుంచి డిమాండ్ త‌గ్గ‌డ‌మే బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.


logo