శుక్రవారం 03 జూలై 2020
Business - Jun 06, 2020 , 01:07:45

జియోలో పెట్టుబడుల వరద

జియోలో పెట్టుబడుల వరద

  • ముబదాల 1.85 శాతం వాటా కొనుగోలు
  • వాటాను మరింత పెంచుకున్న సిల్వర్‌ లేక్‌

న్యూఢిల్లీ, జూన్‌ 5: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికం వెంచర్‌ జియోలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటి వరకు అమెరికాకు చెందిన సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టగా..తాజాగా అబుదాబీకి చెందిన  ముబదాల ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ 1.85 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఒప్పందం విలువ రూ.9,093.60 కోట్లు. దీంతోపాటు సిల్వర్‌ లేక్‌ తన వాటాను మరో 0.93 శాతం పెంచుకున్నట్లు వెల్లడించింది. ఒప్పందం విలువ రూ.4,546.80 కోట్లు. గడిచిన ఆరు వారాల్లో ఇది ఏడో ఒప్పందం కావడం విశేషం. దీంతో జియోలోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.92,202.15 కోట్లు.   ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌, విస్టా ఈక్విటీ పార్టనర్స్‌, జనరల్‌ అట్లాంటిక్‌, కేకేఆర్‌, ముబదాలలు పెట్టుబడులు పెట్టాయి. రుణాలను తగ్గించుకోవడానికి జియోలో  20 శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించిన ముకేశ్‌ అంబానీ ఇప్పటి వరకు 19.90 శాతం వాటాను విక్రయించినట్లు అయింది.  మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు రూ.3,36,294 కోట్ల అప్పు ఉండగా, ఇదే సమయంలో రూ.1,75,259 కోట్ల నగదు నిల్వలు కలిగివున్నది.

సంస్థ
వాటా(శాతంలో)
విలువ(రూ.కోట్లలో)
ఫేస్‌బుక్‌
9.99
43,574
సిల్వర్‌ లేక్
2.08
10,202.55
విస్టా ఈక్విటీ
2.32
11,367
జనరల్‌ అట్లాంటిక్
‌1.34
6,598.38
కేకేఆర్‌
2.32
11,367
ముబదాల
1.85
9,093.60logo