బుధవారం 27 మే 2020
Business - May 02, 2020 , 09:06:50

చమురు రంగానికి తీరని నష్టం

చమురు రంగానికి తీరని నష్టం

క‌రోనా ప్ర‌భావం చ‌మురు రంగాన్ని తీవ్రన‌ష్టాల్లోకి నెట్టింది. ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉండ‌టంతో..పెట్రోల్‌, డీజిల్ అమ్మ‌కాలు దారుణంగా ప‌డిపోయాయి. లాక్‌డౌన్ వల్ల రవాణా స్తంభించిపోవడం పెట్రోల్ అమ్మ‌కాలపై ప్ర‌భావాన్ని చూపింది.  ఏప్రిల్ మాసంలో పెట్రోల్ అమ్మకాలు 61 శాతం, డీజిల్ అమ్మకాలు 56 శాతం తగ్గిపోయాయి. ఇక విమానాలు పూర్తిగా ష‌ట్‌డౌన్ కావ‌డంతో విమాన ఇంధన అమ్మకాలు కూడా  91.5 శాతం పడిపోయాయి. ఫ్యాక్టరీలు, ప‌రిశ్ర‌మ‌లు కూడా నడవకపోవడంతో... ఇంధన వాడకం బాగా తగ్గింది. ఐతే... వంటగ్యాస్ వాడకం మాత్రం 12 శాతం పెరిగింది. ప్రజలు ఇళ్లలోనే వంటలు చేసుకుంటూ... గ్యాస్ ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఏప్రిల్ 20 నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడం తమకు కాస్త ఊరట కలిగించిందని చమురు కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పుడు మే 4 నుంచి సడలింపులు మరింత పెంచడం వల్ల... చమురు రంగం మళ్లీ కోలుకునేందుకు ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. మేలో విమాన రంగం కూడా కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. logo