శనివారం 31 అక్టోబర్ 2020
Business - Sep 30, 2020 , 03:28:30

ఐపీవోలకు మార్చి 31 వరకు గడువు

ఐపీవోలకు మార్చి 31 వరకు గడువు

  • రైట్స్‌ ఇష్యూకి గడువు పెంచిన సెబీ

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో సెబీ.. మార్చి 31 వరకు అనుమతించిన సంస్థలు ఐపీవోకి, రైట్స్‌ ఇష్యూకి వచ్చే అవకాశం కల్పించింది. అలాగే ఇష్యూ విలువను కూడా 50 శాతం వరకు పెంచుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు అవకాశం కల్పించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఐపీవో కాలపరిమితిని పెంచాలని ఇండస్ట్రీ వర్గాల విజ్ఞప్తులపై ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని సెబీ వివరించింది. మరోవైపు స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావడానికి సిద్ధమవుతున్న సంస్థలు ఖచ్చితంగా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదికలను సమర్పించాలని సెబీ సూచించింది.  

ఫండ్‌ మేనేజర్లకు కోడ్‌: మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో పనిచేస్తున్న చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అధికారులకు ప్రత్యేక కోడ్‌ అమలులోకి తీసుకొచ్చింది సెబీ.