ఆదివారం 29 మార్చి 2020
Business - Feb 09, 2020 , 23:39:34

రాష్ర్టాలకు మరో రూ.35 వేల కోట్లు!

రాష్ర్టాలకు మరో  రూ.35 వేల కోట్లు!
  • త్వరలో జీఎస్టీ పరిహారం చెల్లించనున్న కేంద్రం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: జీఎస్టీ వసూళ్లలో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ర్టాలకు మరోమారు పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది కేంద్రం. త్వరలో రూ.35 వేల కోట్ల నిధులను విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  2015-16 ఆర్థిక సంవత్సరం ఆధారంగా చేసుకొని రాష్ర్టాల పన్ను ఆదాయం 14 శాతం పెరుగకుంటే ఈ నష్టాన్ని ఐదేండ్లపాటు భరించనున్నది కేంద్రం. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో ఈ పరిహారం మొత్తం తగినంతగా ఉండటం లేదని రాష్ర్టాలు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాలకు సంబంధించి గత ఏడాది డిసెంబర్‌లోనే రూ.35,298 కోట్లు విడుదల చేసింది. మరో రూ.35 వేల కోట్లను రెండు విడుతలుగా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తొలి విడుత అక్టోబర్‌-నవంబర్‌ మాసాలకు సంబంధించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన జూలై 2017 నుంచి ఇప్పటి వరకు రాష్ర్టాలకు కేంద్రం రూ.2.11 లక్షల కోట్ల మేర నిధులను పరిహారం రూపంలో చెల్లించింది. 


logo