సోమవారం 30 మార్చి 2020
Business - Jan 29, 2020 , 00:39:56

ఎగుమతుల కోసం..

ఎగుమతుల కోసం..

న్యూఢిల్లీ, జనవరి 28: మొబైల్‌ ఫోన్ల ఎగుమతులను ప్రోత్సహించే దిశగా కేంద్రం యోచిస్తున్నది. గతేడాది డిసెంబర్‌ 7న ఎగుమతి సుంకం ప్రోత్సాహకాన్ని 4 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే దేశీయ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తిరిగి 4 శాతానికి పెంచాలని మోదీ సర్కారు భావిస్తున్నది. ఈ నెల 1 నుంచే ఈ మార్పును అమల్లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు అతి త్వరలోనే రావచ్చని కూడా తెలుస్తున్నది. ఈ ఎగుమతి సుంకం ప్రోత్సాహకాన్ని తగ్గించడంపై ఐసీఈఏ అసంతృప్తి వ్యక్తం చేసినది తెలిసిందే.


logo