గురువారం 06 ఆగస్టు 2020
Business - Feb 14, 2020 , 00:15:28

డిస్కవరీ స్పోర్ట్‌లో బీఎస్‌-6 వెర్షన్‌

డిస్కవరీ స్పోర్ట్‌లో బీఎస్‌-6 వెర్షన్‌
  • డిస్కవరీ స్పోర్ట్‌ @ 57.06 లక్షలు

ముంబై, ఫిబ్రవరి 13: టాటా మోటర్స్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వర్‌ ల్యాండ్‌ రోవర్‌..గురువారం దేశీయ మార్కెట్లోకి ఎస్‌యూవీ డిస్కవరీ స్పోర్ట్‌ను బీఎస్‌-6 వెర్షన్‌లో విడుదల చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ కారు ప్రారంభ ధరను రూ.57.06 లక్షలుగా నిర్ణయించింది. ఈ నూతన డిస్కవరీ స్పోర్ట్‌లో ప్రీమియం ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌, పలు నూతన ఫీచర్స్‌తో తయారు చేసింది. 2015లో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ కారు అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఇది కూడా ఒకటని జేఎల్‌ఆర్‌ ఇండియా ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ సూరి తెలిపారు. 2019లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న ఆటోమొబైల్‌ రంగం..2020లో మాత్రం కాస్త వృద్ధిని నమోదు చేసుకునే అవకాశాలున్నాయన్నారు. ఈ ఏడాది కొత్తగా 10 నుంచి 12 మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వీటిలో విద్యుత్‌తో నడిచేకార్లు, హైబ్రిడ్‌ వాహనాలు కూడా ఉన్నాయని ఆయన సంకేతాలిచ్చారు. 

తాజావార్తలు


logo