బుధవారం 27 జనవరి 2021
Business - Jan 13, 2021 , 12:48:29

ఇండియాకు టెస్లా.. కారు ధ‌ర ఎంతో తెలుసా?

ఇండియాకు టెస్లా.. కారు ధ‌ర ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచంలోనే అత్య‌ధిక విలువ క‌లిగిన కార్ల‌ కంపెనీ టెస్లా అతి త్వ‌ర‌లోనే ఇండియాలో అడుగుపెట్ట‌నుంది. ఇప్ప‌టికే బెంగ‌ళూరు ఆఫీస్‌ను కూడా రిజిస్ట‌ర్ చేసుకుంది. నిజానికి ఎన్నో ఏళ్లుగా టెస్లా.. ఇండియాకు వ‌స్తోంద‌న్న వార్త‌లు ఉన్నా ఈసారి మాత్రం ఆ సంస్థ రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కూడా ఈ సంస్థ ఇండియాకు వ‌స్తున్న‌ట్లు ధృవీక‌రించారు. అంతేకాదు ఈ కార్లు కంప్లీట్‌లీ బిల్ట‌ప్ యూనిట్స్(సీబీయూ) రూపంలో వ‌స్తున్న‌ట్లు కూడా ఆయ‌న చెప్పారు. అంటే కారు మొత్తం అమెరికాలో త‌యారై.. ఇక్క‌డికి దిగుమ‌తి అవుతాయి. 

రేటు చాలా ఘాటే..

టెస్లా ఇండియాకు వ‌స్తుందంటే ఏ మోడ‌ల్‌ను ముందుగా ఇక్క‌డ లాంచ్ చేస్తారో అన్న ఆస‌క్తి చాలా మందిలో నెల‌కొన్న‌ది. ప్ర‌స్తుతం వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం టెస్లా మోడ‌ల్ 3 ఎల‌క్ట్రిక్‌ కారు ఇండియాలో ముందుగా లాంచ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే సీబీయూ రూపంలో ఇండియాకు వ‌స్తున్న కార‌ణంగా ఈ కార్ల‌పై 100 శాతం దిగుమ‌తి సుంకం విధిస్తారు. దీనివ‌ల్ల ఈ కార్ల ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉంటుంది. మోడ‌ల్ 3 ధ‌ర సుమారు రూ.60 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ మోడ‌ల్‌లోనూ మూడు వేరియంట్లు ఉంటాయి. ఈ మోడ‌ల్స్‌ను ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే క‌నిష్ఠంగా 463 కిలోమీట‌ర్ల నుంచి 568 కిలోమీట‌ర్ల వ‌ర‌కూ ప్ర‌యాణిస్తాయి. 


logo