శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Jan 24, 2021 , 20:12:29

టెస్లా ర‌హ‌స్య‌ డేటా చోరీకి టెక్కీ య‌త్నం!

టెస్లా ర‌హ‌స్య‌ డేటా చోరీకి టెక్కీ య‌త్నం!

శాన్‌ఫ్రాన్సిస్కో: ప‌్ర‌ముఖ విద్యుత్ కార్ల త‌యారీ సంస్థ టెస్లాలో కెరీర్ ప్రారంభించిన మూడు రోజుల్లోనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ త‌న దొంగ బుద్ది బ‌య‌ట‌పెట్టుకున్నాడు. అలెక్స్ ఖాతిలోవ్ అనే ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌.. రోడ్ మ్యాప్ ఫ‌ర్ టెస్లాస్ ఇన్నోవేష‌న్ ప్లాన్‌కు సంబంధించిన 26 వేల కాన్పిడెన్షియ‌ల్ ఫైళ్ల‌ను క్లౌడ్ స్టోరేజీ స‌ర్వీస్ డ్రాప్‌బాక్స్ సొంత ఖాతాలోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తూ.. సంస్థ సెక్యూరిటీ టీంకు ప‌ట్టుబ‌డ్డాడు.

అయితే, తాను వ్య‌క్తిగ‌త అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్ల‌ను మాత్ర‌మే ట్రాన్స్‌ఫ‌ర్ చేశాన‌ని చెబుతున్న ఖాతిలోవ్‌.. డ్రాప్ బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన ఫైళ్ల ఆధారాల‌ను డిలిట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. పొర‌పాటున త‌న డ్రాప్ బాక్స్‌లోకి సాఫ్ట్‌వేర్ ఫైళ్లు ట్రాన్స్‌ప‌ర్ అయ్యాయ‌ని న్యూయార్క్ పోస్ట్‌కు తెలిపారు. 

రోడ్ మ్యాప్ ఫ‌ర్ టెస్లాస్ ఇన్నోవేష‌న్ ప్లాన్‌ను 200 మంది ఏండ్ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డి సిద్ధం చేసిన ప్ర‌ణాళిక ఇది, ఇది త‌మ‌కు, త‌మ పోటీ దారుల‌కు ఎంతో విలువైంద‌ని టెస్లా చెబుతోంది. ఖాతిలోవ్‌కు ఇంకా ఎటువంటి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌లేద‌ని, 50 వేల మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్న టెస్లాలో 40 మందితో ఖాతిలోవ్ టీం ప‌ని చేసింద‌ని పేర్కొంది.

గ‌త నెల 28న నియ‌మితుడైన ఖాతిలోవ్‌.. జ‌న‌వ‌రి ఆరో తేదీన వ‌ర్క్ ఫ్రం హోం ద్వారా ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవ‌డాన్ని టెస్లా సెక్యూరిటీ టీం నిర్ధారించింది. ఆ వెంట‌నే వీడియో ఫోన్ కాల్ ద్వారా ప్ర‌శ్నించింద‌ని, ఆ టీంతో మాట్లాడ‌టాన్ని ఖాతిలోవ్ ఆల‌స్యం చేశాడ‌ని, త‌న కంప్యూట‌ర్ నుంచి ఫైళ్లు డిలిట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని సెక్యూరిటీ టీం వెల్ల‌డించింది.

ఖాతిలోవ్ డ్రాప్‌బాక్స్‌లో అప్‌లోడ్ చేసిన స‌మాచారంలో వేల కాన్ఫిడెన్షియ‌ల్ ఫైళ్ల గురించి ద‌ర్యాప్తు అధికారులు త‌నిఖీలు కొన‌సాగిస్తున్నారు. జ‌న‌వ‌రి ఆరో తేదీనే త‌న‌ను ఉద్యోగం నుంచి తొల‌గించిన సంగ‌తి మీడియా ద్వారా తెలిసింద‌ని, తానే త‌ప్పు చేయ‌లేద‌ని ఖాతిలోవ్ చెప్పాడు. 

గుజ‌రాత్ నుంచి టెస్లా కార్య‌క‌లాపాలు

బెంగ‌ళూరులో కంపెనీ పేరు రిజిస్ట‌ర్ చేసుకున్న టెస్లా.. త‌న కార్య‌క‌లాపాల‌ను గుజ‌రాత్ నుంచి ప్రారంభించే అవ‌కాశాలు ఉన్నాయి. విద్యుత్ కార్ల త‌యారీకి పునాదులు వేయ‌డానికి గుజ‌రాత్ ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని స‌మాచారం.

గుజ‌రాత్‌తోపాటు ఐదు రాష్ట్రాల‌తో కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించే విష‌య‌మై టెస్లా యాజ‌మాన్యం చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తున్న‌ది. బెంగ‌ళూరు న‌గ‌ర శివారుల్లో తూమ‌కూరులో టెస్లాకు అవ‌స‌ర‌మైన భూమిని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆఫ‌ర్ చేసిన‌ట్లు వినిక‌డి. 

అయితే, గుజరాత్ అధికార యంత్రాంగం.. త‌మ రాష్ట్రంలో టెస్లా కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించేందుకు ఆ సంస్థ యాజ‌మాన్యంతో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. అందుకు అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామని, ఇన్సెంటివ్‌లు అందిస్తామ‌ని గుజ‌రాత్ ప్ర‌భుత్వం హామీ ఇస్తోంది. ఇప్ప‌టికే గ్లోబ‌ల్ ఆటో దిగ్గజాలు గుజ‌రాత్‌లో ఉత్పాద‌క యూనిట్ల‌ను ప్రారంభించాయ‌ని స‌ర్కార్ గుర్తు చేస్తున్న‌ది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo