బుధవారం 03 మార్చి 2021
Business - Jan 09, 2021 , 20:34:05

ఫోర్ట్, జీఎంలను దాటేసిన టెస్లా!

ఫోర్ట్, జీఎంలను దాటేసిన టెస్లా!

వాషింగ్ట‌న్‌: అంత‌ర్జాతీయ విద్యుత్ కార్ల త‌యారీ దిగ్గ‌జం టెస్లా మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్.. ల‌క్ష కోట్ల డాల‌ర్ల క్ల‌బ్ దిశ‌గా అడుగులేస్తున్న‌ది. శుక్ర‌వారం తొలిసారి టెస్లా మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ 800 బిలియ‌న్ల డాల‌ర్ల మార్కును దాటేసింది. 

అగ్ర‌శ్రేణి ప్ర‌పంచ కుబేరుడిగా ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ను దాటేసి తొలి స్థానంలోకి టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ వ‌చ్చి చేర‌డం ఆ సంస్థ మార్కెట్ షేర్ శుక్ర‌వారం 5.6 శాతం పెరుగ‌డానికి దోహ‌ద‌ప‌డింది. 

శుక్ర‌వారం సెష‌న్‌లో ఎల‌న్ మ‌స్క్ వాటా గ‌రిష్టంగా 21 శాతం పెరిగింది.  ఇంత‌కుముందు సెష‌న్‌లో టెస్లా మార్కెట్ క్యాపిటలైజేష‌న్ విలువ 774 బిలియ‌న్ డాల‌ర్ల‌ను దాటింది. వాటల్ స్ట్రీట్‌లో ఐదో మోస్ట్ వాల్యూబుల్ కంపెనీగా టెస్లా నిలిచింది. గూగుల్ పేరెంట్ ఆల్పా బెట్‌, సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ త‌ర్వాతీ స్థానం టెస్లాదే కావ‌డం గ‌మ‌నార్హం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo