Elon Musk | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సెకన్‌కు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా.. సెకన్‌కు దాదాపు రూ.3 కోట్లు సంపాదిస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాతోపాటు అంతరిక్ష యానానికి స్పేస్ ఎక్స్ కంపెనీలతో రికార్డులు నెలకొల్పుతున్నారు. అలాగే మస్క్ సంపాదన కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే ఆయన సంపాదన 36.2 బిలియన్ డాలర్లు పెరిగింది.
మన కరెన్సీలో ఎలన్ మస్క్ సంపాదన రూ.2.71 లక్షల కోట్లు. గంటకు రూ.11.31 కోట్లు.. సెకన్‌కు సుమారు రూ.3 కోట్లు సంపాదిస్తున్నారు. హెర్ట్జ్ గ్లోబల్ హోల్డింగ్స్ అనే సంస్థ లక్ష టెస్లా కార్ల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వడంతో ఈ సంస్థ షేర్ పైపైకి దూసుకెళ్లింది. సోమవారం ఒక్కరోజే టెస్లా స్క్రిప్ట్ విలువ 14.9 శాతం పెరిగి 1,045.02 డాలర్లకు చేరింది.
స్టాక్ మార్కెట్లలో ఎలన్‌మస్క్ నికర సంపద సైతం 36.2 బిలియన్ డాలర్లు పెరిగింది. మొత్తం 288.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. 2021లో ఇప్పటి వరకు మస్క్ సంపద విలువ 119 బిలియన్ డాలర్లు ఎగబాకిందని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. టెస్లా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 లక్ష కోట్ల డాలర్లకు చేరుకున్నది. ఆపిల్, అమెజాన్, సౌదీ ఆరాంకో, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఆల్పాబెట్ సరసన వరల్డ్ మోస్ట్ వాల్యూబుల్ కంపెనీగా టెస్లా నిలిచింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
సూడాన్‌లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి
మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!