ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Feb 20, 2021 , 00:43:38

6 నెలల్లో నిబంధనలు తేవాలి

6 నెలల్లో నిబంధనలు తేవాలి

బ్యాంక్‌ లాకర్ల నిర్వహణపై ఆర్బీఐని ఆదేశించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: బ్యాంకుల్లో లాకర్‌ సదుపాయం నిర్వహణకు సంబంధించి ఆరు నెలల్లో తగిన నిబంధనలను రూపొందించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)ను సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. ‘నేడు సామాన్యుల జీవితాల్లోనూ బ్యాంకింగ్‌ సేవలు కీలకంగా మారాయి. నగదు, బంగారం తమ ఇతరత్రా విలువైన ఆస్తులను ఇంట్లో ఉంచేందుకు భయపడుతున్నారు. కాబట్టే లాకర్లకు డిమాండ్‌ పెరిగింది’ అని జస్టిస్‌ ఎంఎం శాంతనగౌడర్‌, జస్టిస్‌ వినీత్‌ సరణ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కనుక పటిష్ఠ భద్రతతో కూడిన లాకర్లు.. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్నది. అలాగే లాకర్లలో పెట్టినవాటిపట్ల బ్యాంకుల బాధ్యతపైనా స్పష్టత ఇవ్వాలన్నది. లాకర్లలోని నగదు చెదలు పట్టిందని, నగలు దెబ్బతిన్నాయని ఇటీవలి కస్టమర్ల ఫిర్యాదుల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. తాజా ఆదేశాలు కూడా కోల్‌కతాకు చెందిన అమితాబ దాస్‌గుప్తా పిటిషన్‌పై విచారణలో భాగంగా వచ్చాయి.

VIDEOS

logo