శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 23, 2021 , 00:44:06

బ్యాంక్‌ లాకర్‌లో చెద పురుగులు

బ్యాంక్‌ లాకర్‌లో చెద పురుగులు

2.2 లక్షల నగదు నాశనం

వడోదర, జనవరి 22: భద్రతకు మారుపేరు బ్యాంక్‌ లాకర్‌. అందుకే మనలో చాలామంది బంగారం, నగదు, ముఖ్యమైన దస్తావేజులను లాకర్లలో భద్రపరుస్తాం. విలువైనవి ఇంటికన్నా లాకర్లలో ఉండటమే పదిలం అని భావిస్తాం. అయితే ఈ బ్యాంక్‌ లాకర్లూ అంత సురక్షితమేమీ కాదని గుజరాత్‌లోని వడోదరలో జరిగిన సంఘటన చెప్పకనే చెప్తున్నది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన ఓ ఖాతాదారుడు రూ.2.20 లక్షలను తన లాకర్‌లో పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత ఆ నగదును తీసుకునేందుకు వచ్చిన సదరు ఖాతాదారుడు లాకర్‌ తెరిచి చూసి అవాక్కయ్యాడు. కరెన్సీని చెద పురుగులు ఆరగించేశాయి మరి. వెంటనే తేరుకుని బ్యాంక్‌ మేనేజర్‌ను సంప్రదించాడు. కాగా, బ్యాంక్‌ లాకర్లలో భద్రపరిచిన ఎటువంటి దానికీ సదరు బ్యాంక్‌ల బాధ్యత ఉండదని ఆర్బీఐ చెప్తుండటం విశేషం. 

VIDEOS

logo