బాండ్ స్కామ్ : గోల్డ్‌మన్ సీఈవో వేతనంలో భారీ కోత

శాన్ఫ్రాన్సిస్కో : ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ తన సీఈవో డేవిడ్ సాల్మన్ వార్షిక వేతనంలో రూ .70 కోట్ల నుంచి రూ . 120 కోట్ల వరకూ కోత విధించింది. మలేషియన్ బ్రైబరీ స్కామ్‌లో బ్యాంకు ప్రమేయంతో సీఈవో సాల్మన్‌తో పాటు బ్యాంకు సీఓఓ జాన్ వాల్డ్రన్, సీఎఫ్‌వో స్టీఫెన్ స్కెర్ల వేతనాలనూ భారీగా తగ్గించినట్టు రెగ్యులేటరీకి సమర్పించిన ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. గోల్డ్‌మన్ శాక్స్ 1 ఎండీబీ బాండు లావాదేవీలు చేపట్టిన సమయంలో సంస్థ లావాదేవీలకు సంబంధించి ఈ ముగ్గురికీ తెలియకపోయినా ఈ వ్యవహారం వ్యవస్ధాగత వైఫల్యంగా బోర్డు భావించిందని పేర్కొంది.
ఈ కుంభకోణంలో గోల్డ్‌మన్ శాక్స్ దోషిగా నిర్ధారణ కావడంతో అమెరికా దర్యాప్తు సంస్ధల విచారణను మూసివేసేందుకు రూ 21,000 కోట్లు చెల్లించేందుకు కంపెనీ అంగీరించింది. ఈ కుంభకోణంతో మలేషియా మాజీ నేత నజీబ్ రజాక్ ప్రభుత్వం కుప్పకూలడమే కాకుండా అవినీతి ఆరోపణలపై ఆయనకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
తాజావార్తలు
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే