శుక్రవారం 05 మార్చి 2021
Business - Jan 05, 2021 , 23:36:48

స్వార్థంతోనే మా టవర్ల కూల్చివేత: రిలయన్స్‌

స్వార్థంతోనే మా టవర్ల కూల్చివేత: రిలయన్స్‌

చండీగఢ్‌: స్వార్థ పరశక్తులే పంజాబ్ రాష్ట్రంలోని తమ టవర్లను కూల్చివేశామని రిలయన్స్‌ జియో ఇన్ఫో డాట్ కామ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను పంజాబ్‌-హర్యానా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్రం, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌, హర్యానాలతోపాటు పలు రాష్ట్రాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరవధిక ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సదరు చట్టాల వల్ల రిలయన్స్‌కు లబ్ధి చేకూరుతుందన్న వదంతుల మధ్య పంజాబ్‌లో 1500కి పైగా జియో టవర్లను ఆగంతకులు కూల్చేశారు. ఇది తమ ప్రత్యర్థులు, స్వార్థ పర శక్తుల పనేనని, తమకు సదరు చట్టాలతో తమకు ఒనగూడేదేమీ లేదని పేర్కొంటూ రిలయన్స్‌ జియో సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది.

టవర్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసి, తీగలు కత్తిరించి వేస్తున్నారని రిలయన్స్‌ జియో ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని సేవా కేంద్రాలు, రిలయన్స్‌ రిటైల్‌ షోరూములను మూసివేస్తున్నారని, టవర్లను కూల్చివేయకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని రిలయన్స్‌ అభ్యర్థించింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo