శుక్రవారం 30 అక్టోబర్ 2020
Business - Aug 25, 2020 , 00:49:38

ఏజీఆర్‌ లెక్క ఇంకా వుంది

ఏజీఆర్‌ లెక్క ఇంకా వుంది

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) లెక్కలు ఇంకా ముగియలేదని సుప్రీం కోర్టుకు టెలికం శాఖ సోమవారం స్పష్టం చేసింది. ట్రేడింగ్‌, షేరింగ్‌ స్పెక్ట్రంపై మొత్తం ఏజీఆర్‌ బకాయిల లెక్కింపు కోసం కోర్టు తుది ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని టెలికం శాఖ తరఫున వాదిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహెతా చెప్పారు. కాగా, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ తదితర దివాలా తీసిన సంస్థల స్పెక్ట్రంను వాడుకున్న సంస్థలు పాత బకాయిలను చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే జియో, ఎయిర్‌టెల్‌లకు భారీ నష్టమే వాటిల్లనున్నది. ముఖ్యంగా ఇప్పటికే ఎయిర్‌టెల్‌పై ఏజీఆర్‌ బకాయిల భారం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఏజీఆర్‌ బకాయిలపై సర్వీస్‌ ట్యాక్స్‌ను రద్దు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను టెలికం ఆపరేటర్ల సంఘం సీవోఏఐ కోరింది. టెల్కోలు ఇప్పటికే నష్టాల్లో ఉన్నారన్నది. ఈ క్రమంలో ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.