ఈవీలో తెలంగాణ దూకుడు!

- ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న సంస్థలు
- చైనాతోపాటు దేశీయ కంపెనీల ఆసక్తి
- 600 ఎకరాల భూమి కేటాయింపు
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ భవిష్యత్తు అవసరాలపై దృష్టిసారిస్తున్నది. ఇప్పటికే అనేక రంగాలకు హబ్‌గా మారిన రాష్ట్రం.. మరో కీలకమైన రంగానికి కూడా ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నది. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)దే కావడంతో ఆ పరిశ్రమలను ఆకర్షించేందుకు పెద్దఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నది. విద్యుత్తు ఆధారిత వాహనాలు, వాటి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే 600 ఎకరాలు కేటాయించింది. కొద్దిరోజుల్లోనే ఎలక్ట్రిక్ వాహనరంగంలో తెలంగాణ దూసుకుపోనున్నది.
హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్ ధరలు సగటుజీవి నెత్తిన కుంపటిలా మారుతున్నాయి. సామాన్యుడి బడ్జెట్లో అగ్రభాగం పెట్రోల్‌కే ధారపోస్తుండటంతో.. ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. అటు కేంద్రం సైతం కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్, సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో రాష్ట్రంలోనూ వాటి తయారీ పరిశ్రమలపై టీఎస్ఐఐసీ దృష్టి సారించింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, విడిభాగాల తయారీ పరిశ్రమలు ముందుకొచ్చాయి. ప్రభుత్వం కూడా వాటికి పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది.
పరిశ్రమల ఏర్పాటుకు స్థలం కేటాయింపు
విద్యుత్తు వాహన పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో బ్యాటరీల తయారీ పరిశ్రమలకు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించగా.. ఇప్పటికే మూడు, నాలుగు సంస్థలు ముందుకు వచ్చాయి. వాహనాల తయారీకి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందన్వెల్లిలో 300 ఎకరాలు కేటాయించారు. ఇందులో ఓ చైనా సంస్థతోపాటు మన దేశానికి చెందిన మరో సంస్థ పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్రెడ్కో) సైతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది.
ఆకర్షిస్తున్న ఎనర్జీ పాలసీ..
రానున్న దశాబ్దకాలంలో ఉద్గారాల స్థాయిని 33 -35 శాతం వరకు తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా విధించింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోనూ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ‘తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-30’ని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో ప్రకటించింది. అన్ని మెట్రోరైలు స్టేషన్ల నుంచి బ్యాటరీతో నడిచే ఫీడర్ షటిల్ సర్వీసులను ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేపట్టింది. స్వయం ఉపాధి పథకాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తేనున్నది. ప్రభుత్వ అధికారులు విద్యుత్తు వాహనాలను ఉపయోగించాలని, పార్కింగ్ స్లాట్స్లోనూ చార్జింగ్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది.
తాజావార్తలు
- ఏనుగుకు ప్యాంట్, షర్ట్ వేస్తే ఎలా ఉంటదో చూశారా?
- పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?
- పోస్ట్‌మార్టమ్‌కు ముందు మృతదేహంలో కదలిక
- ఈ టీ తాగితే దగ్గు చిటికెలో మాయం
- ఏడుపాయల జాతరకు ఏర్పాట్లు చేయండి
- ట్రాన్స్ఫార్మర్పై పడిన చీరను తీస్తుండగా..
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!