సోమవారం 30 మార్చి 2020
Business - Feb 01, 2020 , 00:06:22

టెక్‌ మహీంద్రా లాభాల్లో క్షీణత

టెక్‌ మహీంద్రా లాభాల్లో క్షీణత

న్యూఢిల్లీ, జనవరి 31: టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన టెక్‌ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ.1,146 కోట్ల లాభాన్ని గడించింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,202. 90 కోట్లతో పోలిస్తే 4.7 శాతం క్షీణించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం 7.9 శాతం ఎగబాకి రూ.9,654.60 కోట్లకు చేరుకున్నది. డాలర్ల రూపంలో 1,353 మిలియన్‌ డాలర్ల ఆదాయంపై 160.6 మిలియన్‌ డాలర్ల నికర లాభం సమకూరింది. గత త్రైమాసికంలో 683 మంది సిబ్బంది వైదొలుగడంతో మొత్తం సంఖ్య 1,30,839లకు చేరుకున్నాయి.


logo