e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News క్లౌడ్‌జెన్‌లో హెచ్‌-1బీ ఫ్రాడ్ నిజ‌మే..!

క్లౌడ్‌జెన్‌లో హెచ్‌-1బీ ఫ్రాడ్ నిజ‌మే..!

క్లౌడ్‌జెన్‌లో హెచ్‌-1బీ ఫ్రాడ్ నిజ‌మే..!

న్యూయార్క్‌: విదేశీ నిపుణుల కోసం అమెరికా ప్ర‌తిపాదించిన హెచ్‌-1 బీ వీసాను ఓ టెక్నాల‌జీ సంస్థ దుర్వినియోగం చేసింది. ఈ సంగ‌తిని టెక్సాస్‌లోని హూస్ట‌న్ ఫెడ‌ర‌ల్ కోర్టు ముందు స‌ద‌రు సంస్థ క్లౌడ్‌జెన్ కార్పొరేట్ ప్ర‌తినిధి జొమొన్ చ‌క్కాల‌క్క‌ల్ అంగీక‌రించారు. గ‌త నెల 28న జ‌రిగిన విచార‌ణ‌లో జొమోన్ చ‌క్కాల‌క్క‌ల్ ఈ సంగ‌తి చెప్పార‌ని తాత్కాలిక ఫెడ‌ర‌ల్ ప్రాసిక్యూట‌ర్ జెన్నీఫ‌ర్ బీ లొవెరీ వెల్ల‌డించారు.

అమెరికాకు వ‌చ్చిన త‌ర్వాత ఉద్యోగం లేని వారిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒక ఇంటికి ప‌రిమితం చేస్తారు. అటువంటి వారికి ఉపాధి క‌ల్పించ‌డానికి తాము క్రుషి చేస్తున్న‌ట్లు క్లౌడ్‌జెన్‌ పేర్కొంది.

ఉద్యోగాలు కోల్పోయిన వారి పేరిట థ‌ర్డ్ పార్టీ కంపెనీల త‌ర‌ఫున హెచ్‌-1బీ వీసాల కోసం ఫొర్జ‌రీ చేసిన కాంట్రాక్ట్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించింది. వీసాల‌తో సిద్ధంగా ఉన్న వ‌ర్క‌ర్ల‌ను దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని కంపెనీల అవ‌స‌రాల‌కు అనుగుణంగా పంపిణీ చేస్తుంది.

అమెరికాకు వ‌చ్చిన భార‌తీయుల‌కు ఉద్యోగం వ‌చ్చిన త‌ర్వాత.. విదేశీ వ‌ర్క‌ర్ల కోసం నూత‌న థ‌ర్డ్ పార్టీ కంపెనీ ఇమ్మిగ్రేష‌న్ పేప‌ర్లు స‌మ‌ర్పిస్తుందని ప్రాసిక్యూట‌ర్స్ ఆఫీసు తెలిపింది. ఇలా ఉద్యోగాలు పొందిన వారి వేత‌నం నుంచి క్లౌడ్‌జెన్ కొంత శాతం తీసుకుంటుంది. అది సుమారు 5 ల‌క్ష‌ల డాల‌ర్లు ఉంటుంది.

2013-20 మ‌ధ్య క్లౌడ్‌జెన్ ఈ కుంభ‌కోణానికి పాల్ప‌డింది. దీంతో ఈ సంస్థ‌పై సౌత్ర‌న్ టెక్సాస్ ఫెడ‌ర‌ల్ కోర్టు చీఫ్ జ‌డ్జి లీ రోసెన్‌థాల్ వ‌చ్చే సెప్టెంబ‌ర్‌లో జ‌రిమాన విధించే అవ‌కాశం ఉంది. ఆ జ‌రిమాన 10 ల‌క్ష‌ల డాల‌ర్లు ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఐదేండ్లు దీన్ని ప్రొబేష‌న్‌లో పెట్ట‌నున్నారు.

హూస్గ‌న్ కేంద్రంగా ప‌ని చేస్తున్న క్లౌడ్‌జెన్ వెబ్‌సైట్‌లో కంపెనీ చిరునామా వ‌ర్జీనియాలోని మ‌నాస్సాస్‌లో చూపుతున్న‌ది. హైద‌రాబాద్‌, కెన‌డా, రొమేనియాల్లో కార్యాల‌యాల‌యు ఉన్నాయి. చ‌క్కాల‌క్క‌ల్ సంస్థ సేల్స్ ఉపాధ్య‌క్షుడిగా ఉన్నారు.

ఇవి కూడా చ‌దవండి:

కరోనా రోగుల్లో కొత్త లక్షణాలు .. కోలుకున్నాక హృద్రోగాలు, శ్వాస రుగ్మతలు

N95 Mask ఉత‌కొచ్చా? ఎన్ని రోజుల‌కు ఒక‌సారి మాస్క్ మార్చాలి?

ఆనందయ్య మందు పంపిణీకి కాల్ సెంటర్, యాప్..

టీకాల ఎగుమ‌తిపై భార‌త్ నిషేధం.. 91 దేశాల‌పై తీవ్ర ప్ర‌భావం

Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?

దేశంలో వ్యాక్సిన్‌కు కొర‌త లేదు: ఐసీఎమ్మార్‌

ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్

రూ 50,000 దిశ‌గా ప‌సిడి ప‌రుగు..రూ 73,000కు చేరువైన వెండి

ఈ ఆరు ల‌క్ష‌ణాల‌ను అశ్ర‌ద్ధ చేయ‌కండి

ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్

భారీ ఊర‌ట : కొవిడ్-19 నియంత్ర‌ణ‌లు పూర్తిగా ఎత్తివేత‌!

సోష‌ల్సె క్యూరిటీ కోడ్ ఎఫెక్ట్: నేటి నుంచి పీఎఫ్‌తో ఆధార్ లింక్

పైపైకి బంగారం.. డిసెంబ‌ర్‌క‌ల్లా రూ.57 వేల‌కు..!!

చిప్ స‌ప్ల‌యి కొర‌త‌: ఇప్ప‌ట్లో తేల‌డం క‌ష్ట‌మే: ఇంటెల్

ఈపీఎఫ్‌వో రిలీఫ్‌.. స‌భ్యుల‌కు రెండో కోవిడ్ అడ్వాన్స్‌!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క్లౌడ్‌జెన్‌లో హెచ్‌-1బీ ఫ్రాడ్ నిజ‌మే..!

ట్రెండింగ్‌

Advertisement