శనివారం 06 జూన్ 2020
Business - May 15, 2020 , 00:31:00

టీడీఎస్‌, టీసీఎస్‌ రేట్ల తగ్గింపు

టీడీఎస్‌, టీసీఎస్‌ రేట్ల తగ్గింపు

  • పాన్‌, ఆధార్‌ వివరాలు సమర్పించిన వారికే లబ్ధి: సీబీడీటీ

న్యూఢిల్లీ, మే 14: టీడీఎస్‌, టీసీఎస్‌ రేట్లను తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. డివిడెండ్లు, బీమా పాలసీలు, అద్దెలు, ప్రొఫెషనల్‌ ఫీజులు, స్థిరాస్తి కొనుగోళ్ల రుసుములపై ట్యాక్స్‌ డిడక్షన్‌ను 25 శాతం కుదిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. సవరించిన రేట్లు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలవుతాయని స్పష్టం చేసింది. ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారుల కోసం టీడీఎస్‌/టీసీఎస్‌ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ రేట్లను సవరించినట్టు పేర్కొన్న సీబీడీటీ.. రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువ కలిగిన మోటర్‌ వాహనాల అమ్మకాలపై విధించే టీసీఎస్‌ను 1 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గించింది. టెండూ ఆకులు, కలప, అటవీ ఉత్పత్తులు, బొగ్గు, ఇనుప ధాతువు సహా పలు ఉత్పత్తుల అమ్మకాలపై విధించే టీసీఎస్‌ను కూడా సీబీడీటీ సవరించింది. మరో 23 విభాగాలకు కూడా కొత్త రేట్లను ప్రకటించింది. అయితే పాన్‌, ఆధార్‌ వివరాలు సమర్పించని వారికి కొత్త టీడీఎస్‌/టీసీఎస్‌ రేట్లు వర్తించబోవని సీబీడీటీ స్పష్టం చేసింది. 

విభాగాలు
పాత రేట్లు
కొత్త రేట్లు
స్థిరాస్తి కొనుగోలు చెల్లింపులు, ఈ-కామర్స్‌ పార్టిసిపెంట్స్‌
1%
0.75%
ప్రొఫెషనల్‌ ఫీజులు
2%
1.5%
వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు చెల్లించే అద్దెలు, జీవిత బీమా పాలసీలు, ఇన్సూరెన్స్‌ కమిషన్‌, బ్రోకరేజీ
5%
3.75%
డివిడెండ్లు, వడ్డీలు, స్థిరాస్తి అద్దెలు, నేషనల్‌ సేవింగ్స్‌ డిపాజిట్లు
10%
7.5%
తిరిగి కొనుగోలుచేసే యూనిట్లపై మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు జరిపే చెల్లింపులు
20%
15%logo