శనివారం 30 మే 2020
Business - Feb 04, 2020 , 23:43:44

డివిడెండ్‌ చెల్లింపులపైనే టీడీఎస్‌

డివిడెండ్‌ చెల్లింపులపైనే టీడీఎస్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: మ్యూచువల్‌ ఫండ్స్‌ డివిడెండ్‌ చెల్లింపులపై మాత్రమే 10 శాతం టీడీఎస్‌ వర్తిస్తుందని, రెడెంప్షన్‌ ఆఫ్‌ యూనిట్స్‌పై కాదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం తెలిపింది. ఆయా సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ తమ వాటాదారులకు ఇస్తున్న డివిడెండ్‌పై చెల్లించే డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ)ను రద్దు చేస్తున్నట్లు ఇటీవలి బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ కంపెనీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ తమ వాటాదారుకు ఇచ్చే డివిడెండ్‌/ఆదాయం ఏటా రూ.5,000 దాటితే దానిపై 10 శాతం టీడీఎస్‌ (ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌) వేస్తామని ప్రతిపాదించారు. దీనిపై పన్ను చెల్లింపుదారుల్లో కొంత అయోమయం నెలకొనడంతో సీబీడీటీ స్పందించింది. యూనిట్ల ఉపసంహరణపై పొందే మూలధన లాభాలపై 10 శాతం టీడీఎస్‌ ఉండదని స్పష్టత ఇచ్చింది.


logo