e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News టీసీఎస్ సంచ‌ల‌నం.. ఇక ఆఫీస్‌ల‌కు 25% సిబ్బంది!!

టీసీఎస్ సంచ‌ల‌నం.. ఇక ఆఫీస్‌ల‌కు 25% సిబ్బంది!!

టీసీఎస్ సంచ‌ల‌నం.. ఇక ఆఫీస్‌ల‌కు 25% సిబ్బంది!!

న్యూఢిల్లీ: దేశంలోకెల్లా అతిపెద్ద ఐటీ దిగ్గ‌జం టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్‌) త‌మ సిబ్బందిలో 25 శాతం మందిని ఆఫీసుకు తీసుకురావాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ది. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి గ‌తేడాది త‌మ సిబ్బందికి టీసీఎస్‌ వ‌ర్క్ ఫ్రం హోం (డ‌బ్ల్యూఎఫ్‌హెచ్‌) ఆప్ష‌న్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

నిర్దిష్టంగా కొంత మందిని కార్యాల‌యానికి తీసుకురావాల‌ని టీసీఎస్ భావిస్తున్న‌ది. ఇందుకోసం రిస్క్ అసెస్‌మెంట్ మోడ‌ల్‌- ఇంటెలిజెంట్ అర్బ‌న్ ఎక్స్చేంజ్ విధానాన్ని రూపొందించింది.

ఆయా ఉద్యోగులు నివాసం ఉండే ప్రాంతం, వారి వ్యాక్సికేష‌న్‌, ఇంటి వ‌ద్ద టెస్టింగ్‌, రిస్క్ ఆఫ్ రీజియ‌న్‌, లోకాలిటీ, ప్రాథ‌మిక ఆరోగ్య ప్ర‌మాణాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ది. అందుకనుగుణంగా ఉద్యోగుల‌కు వ‌ర్క్ ప్లేస్ సుర‌క్షితం అని భావించిన వారిని ఆఫీస్‌కు పిలుస్తుంది.

టీసీఎస్ సంచ‌ల‌నం.. ఇక ఆఫీస్‌ల‌కు 25% సిబ్బంది!!

ప‌బ్లిక్ స‌ర్వీసెస్‌, బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజ్‌లు, ఇన్సూరెన్స్ అండ్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూష‌న్లు, టెలికం అండ్ యుటిలిటీ ప్రొవైడ‌ర్లు, రిటైల్‌, క‌న్జూమ‌ర్ గూడ్స్ అండ్ ట్రావెల్‌, బ్యాంక్ ఆన్‌ టీసీఎస్ బ్యాక్ ఎండ్ ఐటీ స‌పోర్ట్ వంటి కీల‌క యుటిలిటీస్‌పై టీసీఎస్ ఆదాయం ఆధార‌ప‌డి ఉంది.

గ‌తేడాది ఏప్రిల్ నుంచి టీసీఎస్ ఉద్యోగుల్లో 97 శాతం మంది ఇంటి వ‌ద్ద నుంచే సేవ‌లందిస్తున్నారు. సేఫ్టీ, బిజినెస్ అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఉద్యోగుల‌ను ద‌శ‌ల వారీగా కార్యాల‌యానికి తిరిగి తీసుకు రావాల‌ని సంస్థ ఆలోచిస్తున్న‌ది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా టీసీఎస్‌లో 4,88,649 మంది ఉద్యోగులు ఉన్నారు.

వంద‌శాతం ప్రొడ‌క్టివ్ కోసం క‌నీసం 25 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుల్లో ఉండేలా బ్లూ ప్రింట్ రూపొందించామ‌ని టీసీఎస్ హ్యూమ‌న్ రీసోర్సెస్ గ్లోబ‌ల్ హెడ్ మిలింద్ ల‌క్క‌డ్ చెప్పారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్ల‌యింట్ల అవ‌స‌రాల‌కనుగుణంగా త‌మ ఉద్యోగుల్లో ప్ర‌తిభ పెంచుకోవ‌డంపైనే టీసీఎస్ ఫోక‌స్ చేస్తున్న‌ది.

ఇవి కూడా చ‌దవండి:

ఇలాగైతే 2025 నాటికే అంద‌రికీ వ్యాక్సిన్ : శివ‌సేన‌

కేఎస్ఆర్టీసీ ఇక కేర‌ళ‌దే.. క‌ర్ణాట‌క‌కు షాక్‌

కశ్మీర్‌ నియంత్రణ రేఖ రక్షణ ఏర్పాట్లపై సైనికాధిపతి సమీక్ష..

ఉచిత కోవిడ్ శిబిరాన్ని ధ్వంసం చేసిన దుండగులు

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం..

జీన్స్‌, టీషర్ట్స్ వేసుకోవ‌ద్దు.. సీబీఐ అధికారుల‌కు కొత్త డైరెక్ట‌ర్ ఆదేశాలు

ఆ వేరియంట్ వ‌ల్లే ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్‌: ప్ర‌భుత్వ అధ్య‌య‌నం

అత్యంత అంద‌విహీన‌మైన భాష క‌న్న‌డ అన్న గూగుల్‌.. క్ష‌మాప‌ణ చెప్పిన సంస్థ‌

కోవిన్‌ పోర్టల్‌లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

Medicinesలోకి Reliance: నిక్లోసామైడ్ వాడ‌కానికి ద‌ర‌ఖాస్తు

పూణే విమానాశ్రయం ద్వారా 10 కోట్లకు పైగా వాక్సిన్ డోసులు రవాణా..

ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎవ‌రూ కాపాడ‌లేరు : ప్ర‌భుత్వ విప్ గువ్వ‌ల‌

రూ.43000 కోట్ల‌తో ఆరు స‌బ్‌మెరైన్ల నిర్మాణానికి ఆమోదం

వ్యాక్సిన్ వేసుకున్న వారికి క‌రోనా వ‌చ్చినా చ‌నిపోలేదు: ఎయిమ్స్ అధ్య‌య‌నం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీసీఎస్ సంచ‌ల‌నం.. ఇక ఆఫీస్‌ల‌కు 25% సిబ్బంది!!

ట్రెండింగ్‌

Advertisement