మంగళవారం 09 మార్చి 2021
Business - Jan 11, 2021 , 17:01:09

రూ.12 ల‌క్ష‌ల ఎంక్యాప్ క్ల‌బ్‌లో టీసీఎస్‌

రూ.12 ల‌క్ష‌ల ఎంక్యాప్ క్ల‌బ్‌లో టీసీఎస్‌

న్యూఢిల్లీ: ప‌్ర‌ముఖ ఐటీ సేవ‌ల సంస్థ టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్‌) సోమ‌వారం స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. సీజ‌న‌ల్‌గా బ‌ల‌హీన త్రైమాసికం అయిన అక్టోబ‌ర్‌-డిసెంబ‌ర్ త్రైమాసికంలో తొమ్మిదేళ్ల‌లోనే మెరుగైన గ్రోత్ సాధించిన టీసీఎస్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్‌ సోమ‌వారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో రూ. 12 ల‌క్ష‌ల వ‌ద్ద నిలిచింది.

దేశీయ సంస్థ‌ల్లో ఈ రికార్డు నెల‌కొల్పిన కార్పొరేట్ల‌లో టీసీఎస్ రెండోది. ఇంత‌కుముందు ముకేశ్ అంబానీ సార‌ధ్యంలోని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఈ మైలురాయిని చేరుకున్న‌ది. 2020 జూలైలో రిల‌య‌న్స్ షేర్ విలువ రూ.1900 కాగా, దాని మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.12 ల‌క్ష‌లు దాటింది. ప్ర‌స్తుతం రిల‌య‌న్స్ ఎం-క్యాప్ రూ.12.29 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. 

టీసీఎస్ ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మూడో త్రైమాసికంలో గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే 7.17 శాతం గ్రోత్ సాధించి రూ.8,727 కోట్ల నిక‌ర లాభం గ‌డించింది. సెప్టెంబ‌ర్ నెల‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో టీసీఎస్ నిక‌ర లాభం రూ.7,504 కోట్లుగా నిలిచింది.

అయితే మూడో త్రైమాసికంలో 7.17 శాతం గ్రోత్ న‌మోదు చేసుకోవ‌డంతో సోమ‌వారం స్టాక్ మార్కెట్‌లో ప్ర‌త్యేకించి బీఎస్ఈలో టీసీఎస్ షేర్ ధ‌ర 3.5 శాతం పెరిగి రూ.3,230ల‌కు చేరుకున్న‌ది. తద్వారా 52 వారాల‌ తాజా గ‌రిష్ఠ స్థాయి న‌మోదు చేసింది. తాజాగా సోమ‌వారం మ‌ధ్యాహ్నం టీసీఎస్ షేర్ విలువ 1.56 శాతం (రూ.58.65) పెరిగి రూ.3,169 వ‌ద్ద ట్రేడ్ అవుతుండ‌గా, 3.30 గంట‌ల‌కు రూ.3,175 వ‌ద్ద నిలిచింది. టీసీఎస్ షేర్ మున్ముందు 32 శాతం గ్రోత్ సాధిస్తుంద‌ని మార్కెట్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo