ప్రపంచంలో అతిపెద్ద ఐటీ సంస్థగా టీసీఎస్ అవతరణ

మార్కెట్ క్యాప్‌లో యాక్సెంచర్‌ను అధిగమించిన సంస్థ
రూ.12.34 లక్షల కోట్లతో ప్రపంచంలో అతిపెద్ద ఐటీ సంస్థగా అవతరణ
న్యూఢిల్లీ, జనవరి 25: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోమారు తన సత్తాను చాటింది. మార్కెట్ విలువలో దేశీయ అత్యంత విలువైన సంస్థగా ఆవిర్భవించింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను వెనక్కినెట్టి టీసీఎస్ తొలి స్థానం సాధించింది. రూ.12,34,609.62 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో టీసీఎస్ ఈ సత్తా చాటింది. రూ.12,29,661.32 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నది. ఇంట్రాడేలో 1.26 శాతం పెరిగిన టీసీఎస్ షేరు ధర చివరకు 0.40 శాతం నష్టంతో రూ.3,290.20 వద్ద ముగిసింది. ఇదే సమయంలో ఆర్ఐఎల్ షేరు 5.36 శాతం పతనం చెంది రూ.1,939.70 వద్ద నిలిచింది. గతేడాది మార్చిలో తన తొలి స్థానాన్ని కోల్పోయిన టీసీఎస్..మళ్లీ పది నెలల తర్వాత తిరిగి చేజిక్కించుకున్నది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ సంస్థలో టీసీఎస్ అగ్రగామికి చేరుకున్నది. ఇప్పటి వరకు 168.44 బిలియన్ డాలర్లతో తొలిస్థానంలో నిలిచిన యాక్సెంచర్‌ను టీసీఎస్ 169.20 బిలియన్ డాలర్లతో వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నది.
మార్కెట్ విలువలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు
ర్యాంకింగ్ కంపెనీ మార్కెట్ క్యాప్ స్టాక్
(బిలియన్ డాలర్లలో) ఎక్సేంజ్
1 టీసీఎస్ 169.2 బీఎస్ఈ
2 యాక్సెంచర్ 168.4 ఎన్వైఎస్ఈ
3 ఎస్ఏపీ 155.5 ఎన్వైఎస్ఈ
4 ఐబీఎం 105.6 ఎన్వైఎస్ఈ
5 ఇన్ఫోసిస్ 77.28 బీఎస్ఈ
6 కాగ్నిజెంట్ 43.07 నాస్డాక్
7 హెచ్‌సీఎల్ 35.25 బీఎస్ఈ
8 విప్రో 34.15 బీఎస్ఈ
9 క్యాప్‌జెమినీ 25.05 ఈపీఏ
10 ఈపీఏఎం 20.14 ఎన్వైఎస్ఈ
తాజావార్తలు
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్‌తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు
- అరసవల్లి సూర్యనారాయణస్వామిని తాకని భానుడి కిరణాలు
- అలియా భట్ ‘గంగూభాయ్’ సినిమాపై చెలరేగిన వివాదం