ఆదివారం 07 మార్చి 2021
Business - Dec 30, 2020 , 13:15:32

టాటా 7 సీట‌ర్ ఎస్‌యూవీ వ‌చ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

టాటా 7 సీట‌ర్ ఎస్‌యూవీ వ‌చ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

టాటా నుంచి చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న‌ 7 సీట‌ర్ ఎస్‌యూవీ గ్రావిటాస్ వ‌చ్చేస్తోంది. జ‌న‌వ‌రి 26, 2021న రిపబ్లిక్ డే సంద‌ర్భంగా కారును లాంచ్ చేస్తున్న‌ట్లు టాటా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే టాటా నుంచి హ్యారియ‌ర్ ఎస్‌యూవీ ఉన్న సంగ‌తి తెలుసు క‌దా. దీనికే అద‌నంగా ఒక వ‌రుస సీట్ల‌ను చేర్చి గ్రావిటాస్‌ను టాటా తీసుకొస్తోంది. నిజానికి హ్యారియ‌ర్‌ను లాంచ్ చేసిన‌ప్పుడే ఇందులోనే 7 సీట‌ర్ వేరియంట్‌ను తీసుకురావాల‌ని భావించినా.. త‌ర్వాత పేరు కూడా మార్చాల‌ని నిర్ణ‌యించింది. 

మారిన కొల‌త‌లు

ఈ రెండు ఎస్‌యూవీలు ఒమెగా ప్లాట్‌ఫామ్‌పైనే త‌యారైనా.. గ్రావిటాస్‌లో అద‌న‌పు వ‌రుస‌ను జోడించారు. దీంతో ఈ కారు కొల‌త‌ల్లో మార్పులు వ‌స్తాయి. హ్యారియ‌ర్ మోడ‌ల్ కంటే ఇది 63 మిల్లీ మీట‌ర్ల పొడ‌వు, 80 మిల్లీ మీట‌ర్ల ఎత్తు ఎక్కువ ఉంటుంది. దీంతో మొత్తంగా గ్రావిటాస్ పొడ‌వు 4661 మిల్లీ మీట‌ర్లుగా, వెడ‌ల్పు 1894 మిల్లీమీట‌ర్లుగా, పొడ‌వు 1741 మిల్లీమీట‌ర్లుగా ఉంటుంది. వీల్‌బేస్ మాత్రం హ్యారియ‌ర్‌కు ఉన్న‌ట్లే 2741 మిల్లీమీట‌ర్లుగా ఉండ‌నుంది. గ్రావిటాస్ ముందు భాగంలో ఏ మార్పూ లేక‌పోయినా.. వెనుక మ‌రో వ‌రుస సీటింగ్ కార‌ణంగా డిజైన్ మార‌నుంది. ఈ 7 సీట‌ర్ ఎస్‌యూవీ ధ‌ర రూ. 13 లక్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల మ‌ధ్య ఉండే అవ‌కాశాలు ఉన్నాయి.

VIDEOS

logo