గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 30, 2021 , 17:37:14

విప‌ణిలోకి టాటా టియాగో.. రూ.5.79 ల‌క్ష‌ల‌కే ల‌భ్యం బ‌ట్!

విప‌ణిలోకి టాటా టియాగో.. రూ.5.79 ల‌క్ష‌ల‌కే ల‌భ్యం బ‌ట్!

న్యూఢిల్లీ: ‌టాటా మోటార్స్ జాతీయ విప‌ణిలోకి లిమిటెడ్ ఎడిష‌న్ టియాగో మోడ‌ల్ కారును శ‌నివారం ఆవిష్క‌రించింది. ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ధ‌ర రూ.5.79 ల‌క్ష‌ల‌కు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం అవుతుంది. టియాగో బీఎస్‌-6 వ‌ర్ష‌న్ ఆవిష్క‌రించి ఏడాది అవుతున్న సంద‌ర్భంగా లిమిటెడ్ ఎడిష‌న్ టియాగో కారును ఆవిష్క‌రించిన‌ట్లు ప్ర‌క‌టించింది టాటా మోటార్స్‌. ఇది మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌లో అందుబాటులో ఉంది. ఫ్లేమ్ రెడ్‌, పెర్లెసెంట్ వైట్‌, డేయ్టోనా గ్రే రంగుల్లో సిద్ధంగా ఉంది. 

టాటా మోటార్స్ ప్యాసింజ‌ర్ వెహిక‌ల్స్ బిజినెస్ యూనిట్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ 2016లో విప‌ణిలో ఆవిష్క‌రించిన‌ప్ప‌టి నుంచి టాటా టియాగో.. ఈ సెగ్మెంట్ నుంచి చాలా స‌క్సెస్‌ఫుల్ మోడ‌ల్ కారుగా నిలిచింద‌న్నారు. అంద‌రి అభినంద‌న‌ల‌ను అందుకున్న‌ద‌ని తెలిపారు. 

గ‌తేడాది బీఎస్‌-6 వ‌ర్ష‌న్‌ను ఆవిష్క‌రించిన‌ప్పుడు కూడా జీఎన్‌సీఏపీ నుంచి 4 స్టార్ సేఫ్టే రేటింగ్‌ను అందుకున్న టియాగో అత్యంత సుర‌క్షిత‌మైన మోడ‌ల్ కారుగా నిలిచింద‌ని వివేక్ శ్రీవ‌త్స చెప్పారు. ఈ మోడ‌ల్ కారును ఆవిష్క‌రించిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3.25 ల‌క్ష‌లకు పై చిలుకు యూనిట్లు అమ్ముడ‌య్యాయ‌ని తెలిపారు. టియాగో మోడ‌ల్ కారు మార్కెట్‌లో అత్యంత అద్భుత‌మైన ప్ర‌తిస్పంద‌న‌ను పొందింద‌ని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo