శనివారం 28 మార్చి 2020
Business - Feb 25, 2020 , 23:32:05

టెలికం మంత్రితో టాటా చీఫ్‌ భేటీ

టెలికం మంత్రితో టాటా చీఫ్‌ భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ మంగళవారం కమ్యూనికేషన్‌ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏజీఆర్‌ బకాయిలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఆయన మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశం వివరాలు వెల్లడించడానికి చంద్రశేఖరన్‌ నిరాకరించారు. రూ.14 వేల కోట్ల ఏజీఆర్‌ బకాయిలకుగాను రూ.2,197 కోట్లు మాత్రమే చెల్లించడంతో టాటాకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో ఈ కీలక సమావేశం జరుగడం విశేషం. కంపెనీ బకాయిలు చెల్లింపులపై సంస్థ నుంచి ఎలాంటి హామీ రాలేదని, దీంతో వచ్చే రెండు రోజుల్లోగా నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 


logo