శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 19, 2021 , 21:43:08

బ్యాంక‌ర్లు, ఎన్బీఎఫ్సీల‌‌తో టాటా టైఅప్‌.. అందుకేనా?!

బ్యాంక‌ర్లు, ఎన్బీఎఫ్సీల‌‌తో టాటా టైఅప్‌.. అందుకేనా?!

న్యూఢిల్లీ: వాణిజ్య వాహ‌నాల విక్ర‌యాల‌ను పెంచుకోవ‌డానికి టాటా మోటార్స్ స‌రికొత్త ఎత్తు వేసింది. త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన స్కీమ్‌లు అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల‌తో భాగ‌స్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్న‌ది. ప్రైవేట్ బ్యాంకులైన హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యెస్ బ్యాంక్‌, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌,తోపాటు చోల‌మండ‌లం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్‌, సుంద‌రం ఫైనాన్స్ వంటి ఎన్బీఎఫ్‌సీలు, యూనియ‌న్ బ్యాంక్‌, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ వంటి ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌తో ఒప్పందాలు కుదుర్చుకున్న‌ది. 

టాటా మోటార్స్ క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్ బిజినెస్ యూనిట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ కౌల్ మాట్లాడుతూ త‌మ కస్ట‌మ‌ర్ల వివిధ అవ‌స‌రాల‌ను తీర్చే ల‌క్ష్యంతో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్న‌ట్లు తెలిపారు. అతి త‌క్కువ ఫార్మాలిటీల‌తో క‌స్ట‌మ‌ర్ల‌కు రుణ ప‌ర‌ప‌తి క‌ల్పించ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా క‌స్ట‌మ‌ర్ల‌కు ఇంధ‌న అవ‌స‌రాల కోసం సంబంధిత బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లతో క‌లిసి ఫ్యూయ‌ల్ కార్డులు జారీ చేస్తామ‌న్నారు. వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ ఫైనాన్సింగ్‌, స‌ర్వీస్ కాస్ట్ ఫైనాన్సింగ్ త‌దిత‌ర వ‌స‌తులు త‌మ క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo