ముంబై: టాటా మోటర్స్ అల్ట్రోజ్ మరో రికార్డును సృష్టించింది. పుణె ప్లాంట్లో లక్ష అల్ట్రోజ్ కారును ఉత్పత్తి చేసింది. నవంబర్ 2019లో ఈ ప్లాంట్లో ఉత్పత్తిని ప్రారంభించిన సంస్థ.. కేవలం రెండేండ్లలోపు ఈ మైలురాయికి చేరుకోవడం విశేషం. గడిచిన రెండేండ్లుగా నెలకు 6 వేలకు పైగా యూనిట్లు అమ్ముడవుతున్న ఈ మోడల్.. ఈ ఏడాది మార్చి నుంచి 7 వేలకు పైగా అమ్ముడవుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.