ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 09, 2020 , 02:41:14

వివిధ మోడళ్లపై టాటా మోటర్స్‌ ఆఫర్‌

 వివిధ మోడళ్లపై టాటా మోటర్స్‌ ఆఫర్‌

  • ఆరు నెలలు ఈఎంఐ హాలీడే

న్యూఢిల్లీ, జూలై 8: దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థల్లో ఒకటైన టాటా మోటర్స్‌..ఎంపిక చేసిన మోడళ్లపై ఆరు నెలల ఈఎంఐ హాలీడే ప్రకటించింది. వీటిలో టియాగో, నెక్సాన్‌, ఆల్ట్రోజ్‌లను కొనుగోలు చేసిన వారు తొలి ఆరు నెలలపాటు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు.  ఈ నూతన స్కీంలో జిరో డౌన్‌పేమెంట్‌, ఆరు నెలల ఈఎంఐ హాలీడే(వడ్డీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది), ఐదేండ్ల కాలపరిమితితో 100 శాతం రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సంస్థ కరూర్‌ వైశ్యాబ్యాంక్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. వేతన జీవులు, స్వయంగా ఉపాధి పొందుతున్న వారు అర్హులు. 


logo