శుక్రవారం 03 జూలై 2020
Business - Jun 01, 2020 , 00:21:37

టాటా మోటర్స్‌ ప్రత్యేక ఆఫర్లు

టాటా మోటర్స్‌ ప్రత్యేక ఆఫర్లు

హైదరాబాద్‌, మే 31: దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటర్స్‌ తమ వాహన కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని అధీకృత డీలర్లతో కలిసి ‘కీస్‌ టు సేఫ్టీ’ పేరుతో సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్‌పై ముందుండి పోరాడుతున్న వైద్యారోగ్య, అత్యవసర సేవల సిబ్బందికి ఈ ప్యాకేజీ ద్వారా అధిక కాలపరిమితి కలిగిన రుణాలు, సులభమైన ఈఎంఐలు, ప్రత్యేక రాయితీలతో లబ్ధి చేకూర్చనున్నట్టు తెలిపింది.

టాటా మోటర్స్‌ శ్రేణిలోని హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు, ఎస్‌యూవీలు సహా అన్ని రకాల ప్యాసింజర్‌ వాహన కొనుగోలుదారులకు ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ వివరించింది.logo