శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Feb 11, 2021 , 00:16:26

టాటా కార్లు చౌక

టాటా కార్లు చౌక

  • ఆకర్షణీయమైన రాయితీలు, బోనస్‌లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటర్స్‌ ఈ ఏడాది వాహన అమ్మకాల్లో బలంగా ముందుకు సాగుతున్నది. ఈ జోరు ను ఇలాగే కొనసాగించేందుకు ఈ నెలలో వివిధ రకాల వాహనాలపై ఆకర్షణీయమైన డీల్స్‌ను, డి స్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నది. ఆల్ట్రోజ్‌ మినహా దాదాపు అన్ని రకాల మోడళ్లపై రాయితీలను అందజేస్తున్నది. టాటా మోటర్స్‌ వాహనాల్లో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న ‘టియాగో’ హ్యాచ్‌బ్యాక్‌పై ఇప్పటికే రూ.15 వేల క్యాష్‌ డిస్కౌంట్‌ అందుబాటులో ఉన్నది. దీనికి అదనంగా రూ.10 వేల ఎక్సేంజ్‌ బోనస్‌, రూ.3 వేల కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ఇదేవిధంగా ‘టిగోర్‌' సెడాన్‌పై రూ.33 వేలు.. ‘నెక్సాన్‌' పెట్రోల్‌ వేరియంట్‌పై రూ.3 వేలు, డీజిల్‌ వేరియంట్‌పై రూ.20 వేలు.. ‘హారియర్‌'పై రూ.45 వేల నుంచి రూ.70 వేల వరకు రాయితీ అందజేస్తున్నది.

VIDEOS

logo