న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్న హెచ్బీఎక్స్ మైక్రో ఎస్‌యూవీకి టాటా హెచ్బీఎక్స్ అని పేరు పెట్టింది. హెచ్బీఎక్స్ మానికర్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న టాటా మైక్రో ఎస్యూవీ.. కాన్సెప్ట్ కారును గతేడాది ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. 2019 జెనీవా మోటార్ షోలో వెలుగు చూసిన హెచ్2ఎక్స్ కాన్సెప్ట్ నుంచి హెచ్బీఎక్స్ మోడల్ వచ్చింది. టాటా మోటార్స్.. హెచ్బీఎక్స్ మోడల్ కారుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఎంట్రీ లెవల్ కార్ల రంగంలో టాటా మోటార్స్‌కు ఇది గేమ్ చేంజర్‌గా నిలువనున్నది. ప్రత్యేకించి మారుతి సుజుకి, రెనాల్ట్, మహీంద్రాలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
నెక్సాన్, సఫాయి వేరియంట్లలోని ఫీచర్లతో టాటా హెచ్బీఎక్స్ మైక్రో ఎస్యూవీ కారు రూపుదిద్దుకున్నది. ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో స్ప్లిట్ స్టైల్ హెడ్ ల్యాంప్, ట్రై-యారో డిజైన్ మెష్ గ్రిల్లె, సర్క్యులర్ ఫాగ్ లాంప్స్, ఇంటిగ్రేటెడ్ సైడ్ ఇండికేటర్స్తోపాటు అడ్జస్టబుల్ ఓఆర్వీఎంస్, అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, రూఫ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, రాక్డ్ రేర్ వైండ్ స్క్రీన్ తదితర ఫీచర్లు జత కలిశాయి.
టాటా నెక్సాన్‌లో మాదిరిగా హెచ్బీఎక్స్ లోపల స్మాల్ స్టిక్-ఔట్ డిస్ప్లే, స్టార్ట్-స్టాప్ బటన్, ఫ్లాట్ బాటంతోపాటు మౌంటెడ్ కంట్రోల్ స్టీరింగ్ వీల్, ఎంఐడీ యూనిట్‌తోపాటు లార్జ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఆల్టోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో మాదిరిగా పవర్స్, 1.2 లీటర్ల రివోట్రోన్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 85 బీహెచ్పీ, 113 ఎన్ఎం విద్యుత్ విడుదల సామర్థ్యం కలిగి ఉంటుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్.. ఆప్షనల్‌గా ఏఎంటీ యూనిట్ తీసుకోవచ్చు.
మారుతి సుజుకి ఎంట్రీ లెవెల్ కార్లు సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఆల్టో మోడల్ కార్లకు టాటా హెచ్బీఎక్స్ గట్టి పోటీ ఇవ్వనున్నది. అలాగే రెనాల్డ్ క్విడ్, మహీంద్రా కేయూవీ 100 మోడల్ కార్లతోనూ పోటీ పడనున్నది.