శనివారం 06 మార్చి 2021
Business - Jan 16, 2021 , 15:44:12

టెస్లాతో భాగస్వామ్యమా? నో వే అంటున్న టాటా

టెస్లాతో భాగస్వామ్యమా? నో వే అంటున్న టాటా

న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్‌ కార్ల తయారీకి టెస్లాతో భాగస్వామ్యానికి అవకాశాలే లేవంటున్నది టాటా మోటార్స్‌ సంస్థ. ఎలక్ట్రిక్ వాహనాల కోసం టెస్లాతో భాగస్వామ్యం కావాలన్న ఎలోన్ మస్క్ చర్చను టాటా మోటార్స్ తిరస్కరించింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) అనుబంధ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సోషల్ మీడియా పోస్ట్ తరువాత టాటా మోటార్స్, టెస్లా మధ్య భాగస్వామ్యం గురించిన ఊహాగానాలు పచార్లు చేశాయి. అయితే, సంస్థ ఇప్పుడు తన పోస్ట్‌ను తొలగించింది.

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, పాత పాపులర్ బాలీవుడ్ పాట - "తేరే మేరే ప్యార్ కే చార్చే" ను పేరడీ చేస్తూ శుక్రవారం మరో పోస్ట్‌ చేసింది. 'వెల్‌కమ్ టెస్లా', 'టెస్లా ఇండియా' హాస్టాగ్‌లు దాని క్రింద ఉంచబడ్డాయి. పుకార్లు మార్కెట్ వేడెక్కిన తరువాత ఈ పోస్ట్ తొలగించబడింది. దీని తరువాత, టాటా మోటార్స్.. మా ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ వ్యాపారం కోసం వ్యూహాత్మక భాగస్వామి గురించి మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మరో పోస్ట్‌లో టాటా మోటార్స్‌ సంస్థ స్పష్టం చేసింది.

ఈ వారం భారత్‌లోకి ప్రవేశించిన టెస్లా

అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ ఈ వారం ప్రారంభంలో భారత్‌లోకి ప్రవేశించింది. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బెంగళూరులో తన భారతీయ వ్యాపారాన్ని నమోదు చేసింది. భారతదేశంలో ఈవీలను ఉత్పత్తి చేయడానికి టెస్లాకు మొదట్లో స్థానిక భాగస్వామి అవసరం కావచ్చు. టాటా మోటార్స్‌తో టెస్లా భాగస్వామి కాగలదని ప్రజలు ఇప్పటికే ఊహాగానాలు చేస్తున్నారు. ఇది గత వారం టాటా మోటార్స్ షేర్లలో 31.45 శాతం పెరుగుదలకు కారణమైంది. టాటా మోటార్స్ 2021 జనవరి 8 శుక్రవారం బీఎస్‌ఈలో రూ.198.10 వద్ద ముగియగా.. జనవరి 15 శుక్రవారం నాడు రూ.260.40 కు చేరింది. ఈ కాలంలో టాటా మోటార్స్-డీవీఆర్ 24.13 శాతం పెరిగి రూ.81.85 నుంచి రూ.101.60 వద్ద ముగిసింది. నిబంధనల ప్రకారం, భారతదేశంలోకి ప్రవేశించడానికి టెస్లాకు భాగస్వామి అవసరం లేదు. ఎందుకంటే ఆటోమొబైల్ రంగంలో ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) భారత ప్రభుత్వం అనుమతించింది. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ప్రకారం, భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 2025 నాటికి రూ.50 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా.

కేవలం 17 ఏండ్ల క్రితం స్థాపించిన టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్ తయారీదారుగా నిలిచింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 783.12 బిలియన్ డాలర్లు. ఈ సంస్థ 2003 జూలై 1 న స్థాపించబడింది. ఎలోన్ మస్క్ 2008 అక్టోబర్ నుంచి సంస్థ సీఈఓగా ఉన్నారు. ఎలోన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడుగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, ఎలోన్ మస్క్ ఆస్తుల మొత్తం విలువ 197 బిలియన్ డాలర్లు. 

ఇవి కూడా చదవండి..

అంతరిక్ష యాత్ర కేవలం రూ.96 లక్షలకే..

అమెజాన్‌ ‘బ్లూ ఆరిజన్‌’ సక్సెస్‌

మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!

చివరి శ్వాస వరకు అంతరిక్ష పరిశోధనల కోసమే..

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo