శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 29, 2020 , 23:45:10

ఆకట్టుకున్న తాజ్‌ జీవీకే

ఆకట్టుకున్న తాజ్‌ జీవీకే

హైదరాబాద్‌, జనవరి 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.13.16 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.9.46 కోట్ల లాభంతో పోలిస్తే 39.11 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 6.15 శాతం పెరిగి రూ.91.11 కోట్లకు చేరుకున్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్‌ జీవీకే రెడ్డి మాట్లాడుతూ..గత త్రైమాసికంలో అప్పులను తగ్గించుకోగలిగామని, వచ్చే త్రైమాసికాల్లో పనితీరును మెరుగుపరుచుకోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న తాజ్‌కృష్ణ హోటల్‌ను ఆధునీకరిస్తున్నట్లు, ఇప్పటికే 200 గదులను నూతనంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. 


logo