న్యూఢిల్లీ, జూన్ 25: తమ తాజ్ బ్రాండ్.. ప్రపంచంలోనే బలమైన హోటల్ బ్రాండ్‌గా గుర్తింపును సాధించిందని టాటా గ్రూప్ ఆతిథ్య రంగ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) శుక్రవారం తెలిపింది. ‘హోటల్స్ 50 2021’ పేరుతో బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన జాబితాలో తాజ్ మొదటి స్థానంలో నిలిచింది. బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ (బీఎస్ఐ) స్కోర్ 89.3గా ఉందని ఐహెచ్‌సీఎల్ ఎండీ, సీఈవో పునీత్ చట్వాల్ వెల్లడించారు. తాజ్ బ్రాండ్ విలువ 296 మిలియన్ డాలర్లుగా ఉందన్నారు. మార్కెటింగ్ పెట్టుబడులు, కస్టమర్ల మెప్పు, ఉద్యోగుల సంతృప్తి, కార్పొరేట్ ఖ్యాతి ఆధారంగా తాజ్ హోటల్స్‌కు ‘ఏఏఏ’ రేటింగ్ ఇచ్చారు. తాజ్ తర్వాతి రెండు స్థానాల్లో ప్రీమియర్ ఇన్ (బ్రిటన్), మెలియా హోటల్స్ ఇంటర్నేషనల్ (స్పెయిన్) ఉన్నాయి.