హైదరాబాద్, సెప్టెంబర్30 (నమస్తే తెలంగాణ): ‘రెవ్ అప్’ స్టార్టప్స్‌కి మద్దతు అందించేందుకు తెలంగాణ ఏఐ మిషన్ (టీ-ఏఐఎం), ఇ2ఇ నెట్వర్క్స్తో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్నది. దీంతో ఏఐ స్టార్టప్స్‌కి అఫర్డబుల్ హై ఫెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్లోబల్ ఆపర్చునిటీస్ పొందటంతో పాటు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, బిజినెస్ గ్రోత్‌లో సహాయం అందనున్నది. ‘ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 100 స్టార్టప్ ఎకోసిస్టంలో హైదరాబాద్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నది. రాష్ట్రంలో ఆవిష్కరణల వాతావరణాన్ని ప్రోత్సహించడంలో మా నిబద్ధతకు నిదర్శనం. ఈ భాగస్వామ్యం స్టార్టప్స్‌కి తోడ్పాటునందించేందుకు సహాయపడుతాయి.’ అని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ సందర్భంగా అన్నారు.