సోమవారం 30 మార్చి 2020
Business - Feb 11, 2020 , 23:52:54

సిండికేట్‌ లాభం 435 కోట్లు

సిండికేట్‌ లాభం 435 కోట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రభుత్వరంగ సంస్థ సిండికేట్‌ బ్యాంక్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్‌ రూ. 434.82 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.107.99 కోట్ల లాభంతో పోలిస్తే నాలుగింతలు ఎగబాకింది. సమీక్షకాలంలో బ్యాంక్‌ ఆదాయం రూ.6,077.62 కోట్ల నుంచి రూ.6,316.57 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. గత త్రైమాసికంలో బాయక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 12.54 శాతం (రూ.26,184. 66 కోట్లు) నుంచి 11.33 శాతానికి(రూ.25,330.10 కోట్లు) తగ్గింది. అలాగే నికర ఎన్‌పీఏ కూడా 6.75 శాతం (రూ.13, 211.17 కోట్లు) నుంచి 5.94 శాతానికి(రూ.12,514.32 కోట్లకు) దిగొచ్చింది. అయినప్పటికీ మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్‌ రూ.1,286.64 కోట్ల నిధులను వెచ్చించింది. గతేడాది కేటాయించిన రూ.909.82 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగాయి. బ్యాంక్‌ షేరు స్వల్పంగా పెరిగి రూ.24.10 వద్ద ముగిసింది. 


logo