గురువారం 03 డిసెంబర్ 2020
Business - Oct 20, 2020 , 01:09:23

హైదరాబాద్‌లో సైక్స్‌ జోరు

హైదరాబాద్‌లో సైక్స్‌ జోరు

కొత్తగా మరో సెంటర్‌ ఏర్పాటు

న్యూఢిల్లీ: డిజిటల్‌ మార్కెటింగ్‌, కస్టమర్‌ సర్వీస్‌ సంస్థ సైక్స్‌ హైదరాబాద్‌లో మరో సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు 33 వేల చదరపు అడుగుల స్థలంలో దీన్ని నెలకొల్పింది. ఈ సెంటర్‌లో మొత్తం 450 మంది ఉద్యోగులను చేర్చుకునేందుకు వీలున్నదని, వీరిలో 300 మందిని ఇప్పటికే నియమించుకున్నామని సైక్స్‌ సోమవారం వెల్లడించింది. ఈ ఏడాది చివర్లోగా మరో 150 మందిని చేర్చుకోనున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లో సైక్స్‌కు ఇది మూడో సెంటర్‌ కాగా, బెంగళూరులో రెండు సెంటర్లున్నాయి. ఇప్పటికే ఉన్న హైదరాబాద్‌లోని 2 కేంద్రాల్లో దాదాపు వెయ్యి మంది పనిచేస్తుండగా.. బెంగళూరులో దాదాపు 200 మంది ఉన్నారు.