Swiggi-Reliance Fact | రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ ప్లీజ్ జాయింట్ వెంచర్‌తో దేశంలోని అతిపెద్ద ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఫుడ్ డెలివరీ కోసం ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌తోపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)ని వాడటమే ఈ ఒప్పందం లక్ష్యం.
దేశవ్యాప్తంగా ఈవీ ఎకోసిస్టమ్ స్రుష్టించడానికి రిలయన్స్ గ్రూప్ ఫాస్ట్ ట్రాక్‌గా ప్రయత్నిస్తున్నది. 10 బిలియన్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే ఎనర్జీ స్టోరేజీ బ్యాటరీలను తయారు చేస్తుంది రిలయన్స్. గురువారం నుంచే ఒప్పందం అమలులోకి వస్తుంది.
జియో-బీపీ బ్రాండ్ కింద వచ్చే ఐదేండ్లలో రిలయన్స్ రిటైల్ ఔట్లెట్ల వద్ద బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను రిలయన్స్ బీమీ మొబిలిటీ ఏర్పాటు చేస్తుంది.
ఈ స్టేషన్లను రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మాల్స్, హోటళ్లు, బిజినెస్ పార్క్‌ల్లో నిర్మిస్తుంది. స్విగ్గీ డెలివరీ పార్టనర్స్ తదితరులకు ట్రైనింగ్‌తోపాటు సాంకేతిక సాయం అందచేస్తుంది.