ఆదివారం 31 మే 2020
Business - May 07, 2020 , 16:42:03

స్విగ్గీకి రాహుల్‌ జాయ్‌మినీ గుడ్‌బై

స్విగ్గీకి రాహుల్‌ జాయ్‌మినీ గుడ్‌బై

న్యూఢిల్లీ: ఇంటింటికి ఆహారాపదార్థాలను చేరవేస్తూ తక్కువ కాలంలోనే వినియోగదారుల మన్ననలు అందుకొన్నది స్విగ్గీ. ఈ సంస్థను వినియోగదారుల అంచనాలకు తగినట్లుగా సేవలు అందించడంలో తనదైన ముద్ర వేసుకొన్న సంస్థ సహా వ్యవస్థాపకుడు రాహుల్‌ జాయ్‌మినీ.. స్విగ్గీకి గుడ్‌బై చెప్పేశాడు. త్వరలో తాను పెస్టో టెక్‌లో చేరబోతున్నట్టు రాహుల్‌ ప్రకటించారు. ఆరేండ్ల క్రితం మరో ఇద్దరు మిత్రుల మాజేటి శ్రీహర్ష, నందన్‌రెడ్డిలతో కలిసి రాహుల్‌ స్విగ్గీని ప్రారంభించారు.

కంపెనీకి రాజీనామా చేసినప్పటికీ రాహుల్‌.. స్విగ్గీ షేర్‌హోల్డర్‌గా, బోర్డ్‌ సభ్యుడిగా కొనసాగుతారు. లాక్‌డౌన్‌ కారణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేసేందుకు స్విగ్గీ జీనిని 125 పట్టణాల్లో గత నెలలో ప్రారంభించింది. స్విగ్గీలో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం, వినియోగదారులను ఆకర్శించడం వంటి పనులతో తాను ఎంతో ఎదిగేందుకు అవకాశం లభించినందుకు స్విగ్గీకి కృతజ్ఞడను అని రాహుల్‌ జాయ్‌మినీ చెప్పారు.


logo