బుధవారం 03 జూన్ 2020
Business - May 20, 2020 , 20:58:12

స్విగ్గీ, జొమోటో ద్వారా మద్యం డోర్‌ డెలివరీ

స్విగ్గీ, జొమోటో ద్వారా మద్యం డోర్‌ డెలివరీ

రాంచీ: కరోనా నేపథ్యంలో మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించడానికి ఇంటి వద్దకే మద్యం సరఫరా చేయాలని జార్ఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను స్విగ్గీ, జొమాటో వంటి డోర్‌ డెలివరీ సంస్థల సేవలు ఉపయోగించుకోనున్నది. తొలి విడుతగా తొమ్మిది పట్టణ ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినప్పటికీ మద్యం దుకాణాలు తెరిచే ఉంటాయి. మద్యం దుకాణాల వద్ద లైన్‌లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా ఈ-టోకెన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. టోకెన్‌ పొందినవాళ్లు నేరుగా వెళ్లి మద్యం పొందవచ్చు.


logo