మంగళవారం 09 మార్చి 2021
Business - Jan 24, 2021 , 02:11:58

టాప్‌ గేర్‌లో స్విఫ్ట్‌

టాప్‌ గేర్‌లో స్విఫ్ట్‌

గతేడాది అమ్ముడైన కార్లలో తొలిస్థానం

న్యూఢిల్లీ, జనవరి 23: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరో రికార్డును సృష్టించింది. కంపెనీకి చెందిన హ్యాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌..గతేడాది అత్యధిక అమ్ముడైన జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. 2020లో దేశవ్యాప్తంగా 1,60,700 యూనిట్లు అమ్ముడయ్యాయి. కరోనా వైరస్‌తో ఇతర వాహన అమ్మకాలు పడిపోయినప్పటికీ స్విఫ్ట్‌కు డిమాండ్‌ పెరుగడం విశేషం.  దేశీయ రోడ్లపైకి అందుబాటులోకి వచ్చిన 2005 నుంచి ఇప్పటి వరకు 23 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అందుబాటులోకి వచ్చిన ఐదేండ్లలో 5 లక్షల మైలురాయికి చేరుకున్న స్విఫ్ట్‌ విక్రయాలు..10 లక్షలకు చేరుకోవడానికి కేవలం మూడేండ్లు పట్టింది. ఆ తర్వాత ఐదు లక్షల యూనిట్లు మూడేండ్లలో అమ్ముడయ్యాయని తెలిపింది. ఈ సందర్భంగా మారుతి సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) శశాంక్‌ శ్రీవాత్సవ మాట్లాడుతూ..గడిచిన పదిహేనేండ్లుగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో స్విఫ్ట్‌ తొలిస్థానంలో నిలిచిందని, ఇప్పటి వరకు 23 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని చెప్పారు. స్విఫ్ట్‌ వినియోగదారుల్లో 53 శాతం మంది 35 ఏండ్ల లోపు వారు కావడం గమనార్హం. 

VIDEOS

తాజావార్తలు


logo