శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Feb 17, 2020 , 23:47:56

బీఎస్‌-6తో బర్గ్‌మ్యాన్‌ స్ట్రీట్‌

బీఎస్‌-6తో బర్గ్‌మ్యాన్‌ స్ట్రీట్‌
  • మార్కెట్లోకి సుజుకీ స్కూటర్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ సుజుకీ మోటర్‌సైకిల్‌ ..సోమవారం దేశీయ మార్కెట్లోకి బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన 125సీసీ సామర్థ్యం కలిగిన బర్గ్‌మ్యాన్‌ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ షోరూంలో ఈ స్కూటర్‌ ధరను రూ.77,900గా నిర్ణయించింది. ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్‌ ఇంజిన్‌ స్టార్ట్‌ కలిగిన ఈ స్కూటర్‌తో సరికొత్త డ్రైవింగ్‌ అనుభవం లభించనున్నదని కంపెనీ ఎండీ కోయిచిరో హిరావ్‌ తెలిపారు. అల్యుమినియం ఫోర్‌-స్ట్రోక్‌ సింగిల్‌-సిలిండర్‌ 124 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ స్కూటర్‌ 8.7 పీఎస్‌ల శక్తినివ్వనున్నది. మరింత పొడువుగా సీటు, సౌకర్యవంతంగా అడుగు పెట్టుకోవడం, మొబైల్‌ చార్జింగ్‌ వంటి ఆధునీక ఫీచర్స్‌ వీటిలో ఉన్నాయన్నారు. 


logo