హైదరాబాద్, ఆగస్టు 18: సువిటాస్ హోలిస్టిక్ హెల్త్‌కేర్‌ను ఢిల్లీకి చెందిన హెచ్‌సీఏహెచ్(హెల్త్ కేర్ ఎట్‌హోం) కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియ రాలేదు. దేశవ్యాప్తంగా హోలిస్టిక్ విభాగం అంచనాలకుమించి వృద్ధిని నమో దు చేసుకుంటున్న నేప థ్యంలో ఈ కొనుగోలు జరిగింది. వచ్చే 4-5 ఏండ్లలో రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల ఆదాయం అంచనావేస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.