బుధవారం 03 మార్చి 2021
Business - Feb 06, 2021 , 02:00:25

పేపాల్‌ పేమెంట్‌ సర్వీసులు నిలిపివేత

పేపాల్‌ పేమెంట్‌ సర్వీసులు నిలిపివేత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ సొల్యుషన్స్‌ సేవల సంస్థ పేపాల్‌..ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా పేమెంట్‌ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాకు చెందిన ఈ ఆర్థిక సేవల సంస్థ..అంతర్జాతీయ వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి సారించడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 మిలియన్ల వినియోగదారులకోసం సేవలను మరింత విసృత పరుచడానికి భారత్‌లో వ్యాపారంపై పెట్టుబడుల పెట్టనున్నట్లు, దీంతో అంతర్జాతీయంగా విక్రయాలు పెరిగే అవకాశం ఉన్నదని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.  ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నైలలో సెంటర్లను నిర్వహిస్తున్నది. అలాగే ఇక్కడ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ టీంను కూడా కలిగివున్నది.  


VIDEOS

logo